‘అఖండ 2’ పై ఫైనల్ క్లారిటీ.. ఆరోజు?

అఖండ 2

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో చేస్తున్న అవైటెడ్ చిత్రమే అఖండ 2 తాండవం. మంచి హైప్ ఉన్న ఈ సినిమా వాయిదా పడి ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ డేట్ కోసం సిద్ధంగా ఉంది. అభిమానులు వీలైనంత త్వరగా సినిమా విడుదల చేయాలని భావిస్తుంటే మేకర్స్ మంచి సమయం కోసం చూస్తున్నారు.

అసలు ఈ అంతటిలో ఒక తుది క్లారిటీ మెయిన్ గా బయటకి రావాల్సి ఉంది. మరి ఈ క్లారిటీ రేపు సోమవారం లేదా మంగళవారంకి వచ్చేస్తుంది అని ఇప్పుడు సమాచారం. మేకర్స్ అయితే ఈ డిసెంబర్ 12 లేదా 25 డేట్స్ లోనే చూస్తున్నారట. సో వాటిలో ఏదొక డేట్ ఈ రెండు రోజుల్లో కన్ఫర్మ్ కానుందట. సో అభిమానులు ఈ రెండు రోజులు వెయిట్ చేస్తే సరిపోతుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా 14 రీల్స్ ప్లస్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ సినిమా 3డి లో కూడా విడుదల కాబోతుంది.

Exit mobile version