నటసింహం బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో, ‘అఖండ 2 – తాండవం’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే.. నిజానికి నాలుగు, అయిదు తేదీల్లో జరిగిన చర్చల్లో ఆర్థిక సమస్యలు చాలా వరకు ఒక కొలిక్కి వచ్చాయని తెలుస్తోంది. ఐతే, ఇంకా సంతకాల వరకు వెళ్లలేదు. కోర్టు తీర్పు అనుకూలిస్తే సహకరించడానికి ఫైనాన్సియర్లు ముందుకు రావచ్చు అని టాక్. మరి ఏం జరుగుతుందో చూడాలి.
ఇక ఈ సినిమాలో సంయుక్త కథానాయికగా కనిపించనున్నారు. ఆది పినిశెట్టి విలన్ పాత్రను పోషిస్తున్నారు. తమన్ స్వరాలు అందిస్తోన్న ఈ సినిమా ఈ నెల రెండో వారం లేదా నాలుగో వారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యే అవకాశం ఉంది. అన్నట్టు ఇప్పటికే, విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ట్రెండ్ సృష్టించిన విషయం తెలిసిందే. అఖండ 2 – తాండవం’ పై రెట్టింపు అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు.
