పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు సుజీత్ డైరెక్ట్ చేయగా, థమన్ సంగీతం అందించాడు. ఈ సినిమాలోని పాటలు, బీజీఎం ప్రేక్షకుల్లో సాలిడ్ రెస్పాన్స్ అందుకుంది. అంతేగాక, ఈ చిత్ర ఆడియోకు సోషల్ మీడియాలోనూ సాలిడ్ రెస్పాన్స్ దక్కింది.
ఇక తాజాగా ఈ చిత్ర ఆల్బమ్ పై థమన్ ఓ ఇంట్రెస్టింగ్ వార్తను షేర్ చేశాడు. “OG సంగీతం హృదయాలతో పాటు చార్ట్‌లను కూడా ఆక్రమించుకుంది.” అంటూ థమన్ తాజాగా ఓ ట్వీట్ చేశాడు. ప్రముఖ మ్యూజిక్ ప్లాట్‌ఫామ్ స్పాటిఫై నిర్వహించిన 2025 బెస్ట్ ఆల్బమ్స్‌లో ఓజీ కూడా చోటు దక్కించుకుంది.
దీన్ని బట్టి ఈ సినిమా ఆడియోకు ఎంతటి ఆదరణ లభించిందో అర్థమవుతోంది. ఇక ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించగా ఇమ్రాన్ హష్మి విలన్ పాత్రలో నటించాడు. డివివి ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు.
