మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’పై ప్రేక్షకుల్లో ఇప్పటికే సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.
ఈ సినిమాలో మరో స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన ఈ చిత్ర షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. అయితే, తాజాగా తన పార్ట్‌కి సంబంధించిన షూటింగ్ పూర్తి చేసినట్లు వెంకీ ప్రకటించాడు. చిరుతో కలిసి నటించాలనే తన కోరికను అనిల్ రావిపూడి ద్వారా తీరిందని.. ఈ సినిమాలో తన పాత్రను బాగా ఎంజాయ్ చేశానంటూ వెంకీ పేర్కొన్నారు.
ఇక ఈ సినిమాలో చిరు-వెంకీ మధ్య వచ్చే సీన్స్, ఓ సాంగ్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాలో స్టార్ బ్యూటీ నయనతార హీరోరయిన్‌గా నటిస్తోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.
Wrapped up my part today for #ManaShankaraVaraPrasadGaru, and what an incredible experience it has been! Working with my favourite @KChiruTweets was an absolute joy and this film has left me with so many lovely memories. It was long overdue to share the screen with ‘Megastar… pic.twitter.com/KAzWcXGBeK
— Venkatesh Daggubati (@VenkyMama) December 3, 2025
