బాహుబలి, RRR, పుష్ప వంటి చిత్రాలతో తెలుగు సినిమాలకు దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొంది. అయితే, ఇండస్ట్రీ పరిస్థితి మాత్రం గొప్పగా సాగడం లేదు. ప్రతి సంవత్సరం వందల సినిమాలు విడుదలైనా, లాభం దక్కేది కొన్ని సినిమాలకే. ఒకప్పుడు OTTలు నిర్మాతలకు సేఫ్టీ నెట్‌గా ఉండేవి, కానీ ఇప్పుడు అది మారిపోయింది.
OTT ప్లాట్‌ఫామ్‌లు కొత్త రూల్స్ పెట్టడంతో నిర్మాతలపై ఒత్తిడి పెరిగింది. థియేటర్లలో సినిమా బాగా ఆడకపోతే అగ్రిమెంట్ అమౌంట్లో 25% తగ్గిస్తారు. ఒకవేళ సినిమా బాగా ఆడితే 25% పెంచుతారు. బాలకృష్ణ ‘అఖండ 2’ ఈ కొత్త నెట్‌ఫ్లిక్స్ మోడల్‌ను ఫాలో కానున్న తొలి భారీ చిత్రంగా నిలువనుంది.
సినిమా రీలీజయిన నాలుగు వారాల్లోనే OTTలోకి వస్తుండటంతో థియేటర్ కలెక్షన్స్ క్షీణిస్తున్నాయి. దీంతో చాలా చిత్రాలు తక్కువ పేమెంట్ పొందే అవకాశాలు ఉన్నాయి. మరి ‘అఖండ 2’ నెట్‌ఫ్లిక్స్ ఎక్కువ మొత్తాన్ని ఇవ్వనుందా లేక తక్కువ ఇస్తుందా అనేది వేచి చూడాలి.
