అవతార్ 3 బుకింగ్స్‌కు డేట్ ఫిక్స్..!

avatar3

హాలీవుడ్ ప్రెస్టీజియస్ చిత్రం ‘అవతార్ 3’ కోసం వరల్డ్‌వైడ్‌గా ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను జేమ్స్ కామెరూన్ డైరెక్ట్ చేస్తుండగా ఈ ఫ్రాంచైజీలో మూడో సినిమాగా ఇది రానుంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్, ట్రైలర్స్ ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేశాయి.

అయితే, ఈ సినిమా కోసం ఇండియన్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను డిసెంబర్ 19న వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇండియాలో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. అయితే, ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా టికెట్ బుకింగ్స్ డిసెంబర్ 5న ఓపెన్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

దీంతో ఈ సినిమా 15 రోజులు ముందుగానే టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేస్తుండటంతో ఈ చిత్రం ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Exit mobile version