క్యాచీగా బెల్లా బెల్లా సాంగ్.. రవితేజ ఈసారైనా కొట్టేనా..?

Bella

మాస్ మహారాజా రవితేజ రీసెంట్‌గా ‘మాస్ జాతర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే, ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో రవితేజ ఇప్పుడు తన నెక్స్ట్ చిత్రంపై ఫోకస్ పెట్టాడు. దర్శకుడు కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే సినిమాలో రవితేజ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా నుండి తాజాగా మేకర్స్ ఓ సాలిడ్ ట్రీట్ అందించారు. ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్‌గా ‘బెల్లా బెల్లా’ అనే పాటను రిలీజ్ చేశారు. ఈ పాట ఆద్యంతం క్యాచీ ట్యూన్స్‌తో ఆకట్టుకుంటుంది. సురేష్ గంగుల అందించిన లిరిక్స్‌కు భీమ్స్ సిసిరోలియో అద్భుతమైన సంగీతం తోడవడంతో ఈ పాట ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తోంది. ఇక ఈ పాటలో రవితేజ, ఆషిక రంగనాథ్ తమదైన స్టయిల్‌లో వేసిన స్టెప్స్ మెప్పిస్తున్నాయి.

మొత్తానికి ఈ సినిమా నుండి ఓ డీసెంట్ సాంగ్‌ను రిలీజ్ చేసి సినిమాపై బజ్ క్రియేట్ చేశారు మేకర్స్. ఇక ఈ సినిమాలో మరో బ్యూటీ డింపుల్ హయతి కూడా హీరోయిన్‌గా నటిస్తోండం గమనార్హం. ఈ చిత్రాన్ని ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version