పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ మాళవిక మోహనన్ లు హీరోయిన్స్ గా దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న భారీ చిత్రమే “ది రాజా సాబ్”. వింటేజ్ ప్రభాస్ ని మళ్ళీ ప్రెజెంట్ చేస్తూ మేకర్స్ సాలిడ్ ట్రీట్ ని ఫ్యాన్స్ కి అందించే ప్రయత్నంలో ఉన్నారు. ఇలా ఆల్రెడీ వచ్చిన ప్రతీ కంటెంట్ మంచి హిట్ గా నిలిచి అంచనాలు పెంచింది. ఇది వరకే మేకర్స్ రెండు ట్రైలర్స్ ని ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు.
అందులో భాగంగా ఆల్రెడీ ఒకటి గత అక్టోబర్ లో వచ్చేసింది. ఇక నెక్స్ట్ రిలీజ్ ట్రైలర్ మాత్రం బాకీ ఉంది. మరి ఈ ట్రైలర్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ ట్రైలర్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందట. ఈసారి విజువల్స్ కానీ మారుతీ విజన్ ఊహాతీయంగా ఉంటాయని టాక్. ఖచ్చితంగా మరోసారి ఆడియెన్స్ గట్టిగా మాట్లాడుకునే విధంగా ఈ ట్రైలర్ అయితే ఉంటుందట. మరి ఈ ట్రైలర్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనే ఇతర డీటెయిల్స్ ఇంకా బయటకి రావాల్సి ఉన్నాయి.
