ఆ హీరో క్షమాపణ చెబుతాడా ? లేదా ?

Ranveer-Singh-and-Kantara

రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘కాంతార చాప్టర్‌ 1’ అద్భుత విజయాన్ని అందుకుంది. అంతకు ముందు వచ్చిన ‘కాంతార’ సినిమా కూడా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా, ఈ చిత్రాల్లో పంజుర్లీ దేవతపై తెరకెక్కించిన కొన్ని సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి. తాజాగా బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ఆ సన్నివేశాలపై చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఫి) వేడుకల్లో రణ్‌వీర్‌ సింగ్‌ కాంతార గురించి మాట్లాడుతూ.. ‘హీరో పాత్రలోకి దెయ్యం ప్రవేశించినప్పుడు సన్నివేశాలు చాలా బాగున్నాయి’ అని కామెంట్స్ చేశాడు.

ఈ కామెంట్స్ కన్నడిగుల ఆగ్రహానికి కారణమైంది. రణ్‌వీర్‌ క్షమాపణలు చెప్పాలంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. పైగా రణ్‌వీర్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తునారు. మొత్తానికి ఈ వివాదం ఇప్పుడు రణవీర్‌ను ఒత్తిడికి గురిచేస్తోంది. మరి అతను క్షమాపణ చెబుతాడా ? లేదా ? అనేది చూడాలి. ‘కాంతర’లో తన అద్భుతమైన నటనకు గాను రిషబ్‌ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును కూడా అందుకున్న విషయం తెలిసిందే.

Exit mobile version