సి సెంటర్ ఆడియన్స్ కోసం యాక్షన్ 3డి టీం కొత్త గ్లాసెస్

Action 3D (5)

కామెడీ కింగ్ అల్లరి నరేష్ నటించిన భారీ బడ్జెట్ కామెడీ ఎంటర్ టైనర్ ‘యాక్షన్ 3డి’ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. మామూలుగా సి సెంటర్లలో వసతులు అంత బాగుండవు, అందుకే వారిక మంచి క్వాలిటీ ఉన్న సినిమా చూపించాలని ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ప్రత్యేకంగా సి సెంటర్స్ వారి కోసం అనగ్లిప్ 3డి టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. దీనికోసం చైనా నుంచి స్పెషల్ గ్లాసెస్ తెప్పించారు. ఇవి పక్కా 100% ఒరిజినల్ 3డి అంత ఎఫ్ఫెక్టివ్ గా ఉండకపోయినా అనగ్లిప్ 3డి టెక్నాలజీ సి సెంటర్ ప్రేక్షకులకి 3డి టేస్ట్ ని రుచి చూపుతుంది. మల్టీ ప్లెక్సుల్లో మరియు ఏ సెంటర్లలో రియల్ 3డిలో సినిమా చూసే అవకాశం ఉంది.

ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించడమే కాకుండా దర్శకత్వం కూడా చేసారు. అల్లరి నరేష్, కిక్ శ్యాం, వైభవ్, రాజు సుందరం హీరోలుగా నటించిన ఈ సినిమాలో నీలం ఉపాధ్యాయ్, స్నేహ ఉల్లాల్, కామ్న జఠ్మలాని, షీన హీరోయిన్స్ గా నటించారు. వీళ్ళు కాకుండా కమెడియన్స్ బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, మాస్టర్ భరత్, సునీల్, పోసాని కృష్ణ మురళి కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు.

Exit mobile version