తమిళ హీరో కార్తి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘వా వాతియార్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయింది. నలన్ కుమారసామి డైరెక్ట్ చేస్తున్న ఈ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రంలో కార్తి ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సరికొత్త లుక్‌తో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాను తెలుగులో ‘అన్నగారు వస్తారు’ అనే టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నారు.
తాజాగా ఈ చిత్ర టీజర్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి లాంచ్ చేశారు. ఈ టీజర్ ఆద్యంతం ఎంటర్టైనింగ్ మ్యూజిక్‌తో సాగింది. పోలీస్ ఆఫీసర్‌గా కార్తికి గ్రాండ్ వెల్కమ్ లభిస్తుంది. ఈ సందర్భంగా కార్తి డ్యాన్స్ చేస్తూ వస్తున్న సీన్ మనకు ఈ టీజర్లో చూపెట్టారు. దీంతో పాటు సినిమాలోని మరికొన్ని షాట్స్ కూడా కనిపించాయి. ఇందులో కార్తి యాక్షన్ మోడ్‌లోకి షిఫ్ట్ అవడం, అందాల భామ కృతి శెట్టితో పాటు పలువురు ఆర్టిస్టుల గ్లింప్స్ ఇచ్చారు.
మొత్తానికి ఈసారి యాక్షన్‌తో పాటు కామెడీ ప్యాకేజీ కూడా కార్తి పట్టుకొస్తున్నట్లు ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమాలో సత్యరాజ్, ఆనందరాజ్, రాజ్‌కిరణ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
