వెంకటేష్ అభిమానులకు బర్త్‌డే గిఫ్ట్: డిసెంబర్ 13న 4Kలో “పెళ్లి చేసుకుందాం” రీ-రిలీజ్

pellichesukundamra

విక్టరీ వెంకటేష్ నటించిన ట్రెండ్‌సెట్టింగ్ బ్లాక్‌బస్టర్ చిత్రం “పెళ్లి చేసుకుందాం” డిసెంబర్ 13న ఆయన జన్మదిన కానుకగా రీ-రిలీజ్ అవుతోంది. ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ స్థాయిలో 4K రిజల్యూషన్‌లో విడుదల చేయడానికి సాయిలక్ష్మీ ఫిల్మ్స్ సిద్ధమైంది. వెంకటేష్ కెరీర్‌లో అసాధారణ విజయం సాధించిన చిత్రాలలో ఇదొకటి.

సుప్రసిద్ధ దర్శకులు ముత్యాల సుబ్బయ్య రూపొందించిన ఈ సినిమాలో సౌందర్య హీరోయిన్‌గా నటించారు. సి.వెంకట్రాజు, శివరాజు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి పోసాని కృష్ణమురళి సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాయిలక్ష్మీ ఫిల్మ్స్ పతాకంపై వరప్రసాద్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడుతూ, “సంక్రాంతికి వస్తున్నాం” చిత్రంతో తెలుగులో ₹300 కోట్ల క్లబ్ ఫౌండర్ హీరోగా చరిత్ర సృష్టించిన వెంకటేష్ బాబు నటించిన ‘పెళ్లి చేసుకుందాం’ లాంటి ఆణిముత్యాన్ని 4Kలో ప్రేక్షకులకు అందించే అవకాశం దొరకడం గర్వంగా ఉంది. రెండు రాష్ట్రాల్లోని విక్టరీ అభిమానులు, సినీ ప్రేమికులు ఈ చిత్రాన్ని ఆదరిస్తారని నమ్మకం ఉంది. ఈ చిత్ర హక్కులు మూడేళ్ల పాటు మా దగ్గర ఉన్నాయి” అని తెలిపారు.

Exit mobile version