‘స్ట్రేంజర్ థింగ్స్’ ఫ్యాన్స్ కి మ్యాడ్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చిన ఫైనల్ ఎపిసోడ్

Stranger-Things-S5

వరల్డ్ ఓటిటి ఆడియెన్స్ ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ సీక్వెల్ నే స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5. దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ నుంచి ఏ చిన్న అప్డేట్ దీనిపై వచ్చినా సెన్సేషనల్ గా మారేది. మరి ఎట్టకేలకి నిన్న ఈ సీజన్ తాలూకా వాల్యూమ్ 1 గా మొత్తం 4 ఎపిసోడ్స్ వచ్చేసాయి.

అయితే ఈ ఎపిసోడ్స్ చూసిన తర్వాత ఈ సిరీస్ ఫ్యాన్స్ కి మరోసారి తాము కోరుకున్న ఫీస్ట్ దక్కింది అని చెబుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా నాల్గవ ఎపిసోడ్ అయితే మెంటల్ మాస్ ఎక్స్ పీరియెన్స్ అని అంటున్నారు. సోషల్ మీడియాలో మొత్తం ఈ ఎపిసోడ్ ఇంకా క్లైమాక్స్ పోర్షన్ కోసమే చర్చ నడుస్తుంది.

సిరీస్ కీలక పాత్ర ‘విల్’ కి సూపర్ పవర్స్ రావడం ఏదైతే ఉందో ఒక మ్యాడ్ మూమెంట్ గా ఫ్యాన్స్ కి మారిపోయింది. దీనితో మరింత ఎగ్జైట్ అవుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ర్యాంపేజ్ ఏ లెవెల్లో ఉంటుందో అని వారంతా ఆ టైం కోసం ఎదురు చూస్తున్నారు.

Exit mobile version