సమీక్ష : రివాల్వర్ రీటా – మెప్పించలేకపోయిన క్రైమ్ కామెడీ డ్రామా !

Revolver Rita 1

విడుదల తేదీ : నవంబర్ 28, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : కీర్తి సురేష్, రాధిక శరత్‌కుమార్, సునీల్, రెడిన్ కింగ్స్లీ తదితరులు
దర్శకుడు : JK. చంద్రు
నిర్మాతలు : సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి
సంగీత దర్శకుడు : సీన్ రోల్డాన్
సినిమాటోగ్రాఫర్ : దినేష్ బి. కృష్ణన్
ఎడిటర్ : ప్రవీణ్ కె.ఎల్.

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

కీర్తి సురేష్ టైటిల్ రోల్ లో నటించిన సినిమా ‘రివాల్వర్ రీటా’. జే.కే చంద్రు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ:

డ్రాక్యులా పాండియన్ (సూపర్ సుబ్బరాయన్) పాండిచ్చేరిలో అత్యంత భయంకరమైన డాన్. అతన్ని చంపడానికి ఒక ముఠా బయలుదేరుతుంది. మరోవైపు అతనికి ఉరిశిక్ష అమలు చేస్తున్న సమయంలో పాండియన్, రీటా (కీర్తి సురేష్) ఇంట్లోకి చొరబడి, కొద్దిసేపు ఘర్షణ తర్వాత అతను అక్కడ మరణిస్తాడు. రీటా ఫ్యామిలీకి అతను ఎవరో తెలుస్తోంది. ఎలాగైనా అతని మృతదేహాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ లోపు పాండియన్ హత్యకు ప్లాన్ చేసిన ముఠా, వారిని వెంబడించడం ప్రారంభిస్తుంది. ఇంతలో, ‘డాన్ పాండియన్’ కుమారుడు డ్రాక్యులా బాబీ (సునీల్), తప్పిపోయిన తన తండ్రిని వెతకడం ప్రారంభిస్తాడు. మరి తర్వాత ఏం జరిగింది ?, కథలో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి ?, చివరకు కథ ఎలా ముగిసింది ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన కీర్తి సురేష్ పాత్ర.. ఆ పాత్రకు సంబంధించిన ట్రాక్.. అలాగే మరోవైపు ఆమె క్రైమ్ లోకి ఇరుక్కునే ట్రాక్.. ఆ ట్రాక్ తో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్.. ఇలా మొత్తానికి ఈ సినిమా కొన్ని చోట్ల ఓకే అనిపిస్తోంది. కీర్తి సురేష్ కూడా చక్కగా నటించింది.

కీర్తి సురేష్ తల్లిగా నటించిన రాధిక తన అమాయకమైన హాస్యంతో కొన్నిచోట్ల నవ్వించింది. అలాగే, మరో కీలక పాత్రలో అజయ్ ఘోష్ నటన కూడా చాలా బాగుంది. సునీల్ కూడా తన నటనతో మెప్పించాడు.ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

మైనస్ పాయింట్లు:

ఈ సినిమాకి కథనం ప్రధాన బలహీనత. రెగ్యులర్ ఫార్ములాతో ప్లే సాగింది. ప్రేక్షకులు ఈ రకమైన కథను చాలాసార్లు చూశారు. అలాగే, ఈ సెటప్ నుండి థ్రిల్‌ ను ఆశించడం కూడా కష్టమే. పైగా స్లో నేరేషన్ కూడా ఈ సినిమాకు మరొక అడ్డంకిగా మారుతుంది. మొదటి సగం ఏదో సాగినా, సినిమా రెండవ భాగం మాత్రం బాగా విసిగించింది. కథనాన్ని అనవసరంగా లాగారు.

అదేవిదంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్ గా అనిపిస్తాయి. దీనికితోడు కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగడం, అలాగే మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ని క్లారిటీగా ఎలివేట్ చేయకుండా ల్యాగ్ సీన్స్ తో స్క్రీన్ ప్లేని సాగతీయడంతో.. మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం వంటి అంశాలు కనెక్ట్ కావు. మొత్తానికి కథ కథనాలను కూడా ఇంకా బెటర్ రాసుకుని ఉండి ఉంటే బాగుండేది.

ఇక కొన్ని సీన్స్ సరిగ్గా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వవు. మొత్తానికి దర్శకుడు సినిమాని ఇంట్రెస్టింగ్ గా మొదలు పెట్టి.. ఆ తర్వాత అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశాడు. ముఖ్యంగా సునీల్ పాత్ర వృధా అయింది. జాన్ విజయ్ పాత్ర కథకు ఏ మాత్రం ఉపయోగపడదు.

సాంకేతిక విభాగం :

సినిమాలో దర్శకుడు చెప్పాలనుకున్న కంటెంట్ బాగున్నా.. కథ కథనాలు ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. ఇక సంగీత దర్శకుడు పనితనం బాగనే ఉంది. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకోగా.. కెమెరామెన్ వాటిని తెరకెక్కించిన విధానం కూడా ఆకట్టుకుంది. ఎడిటింగ్ బాగుంది. ఈ చిత్ర నిర్మాతలు సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

తీర్పు:

‘రివాల్వర్ రీటా’ అంటూ వచ్చిన ఈ క్రైమ్ కామెడీ డ్రామా.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కొత్తదనం లేకపోవడం, థ్రిల్ లేకుండా సాగిన ప్లే, పైగా గ్రిప్ లేకుండా సాగిన సీన్స్ బాగాలేదు. అలాగే, కామెడీ అండ్ క్రైమ్ సీన్స్ కూడా ఇంట్రెస్ట్ గా సాగలేదు. ఓవరాల్ గా ఈ సినిమా కనెక్ట్ కాదు.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team 

Exit mobile version