ఓటీటీలోకి రష్మిక కొత్త సినిమా.. కానీ..!

Rashmika Mandanna's Thamma Review

నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన బాలీవుడ్ హారర్ కామెడీ చిత్రం ‘థామా’ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా, నవాజుద్దీన్ సిద్ధిఖీ విలన్ పాత్రల్లో నటించిన ఈ సినిమాను మ్యాడాక్ హారర్ కామెడీ యూనివర్స్(MHCU)లో భాగంగా రూపొందించారు. ఆదిత్య సర్పోట్దార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 21న గ్రాండ్ రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ హిట్ చిత్రంగా నిలిచింది.

అయితే, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా డిసెంబర్ 2 నుండి స్ట్రీమింగ్ కానుంది. అయితే, రెంట్ పద్ధతిలో ఈ సినిమా అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఇక రెగ్యులర్ సబ్‌స్క్రైబర్స్‌కు ఈ సినిమా డిసెంబర్ 16 నుండి అందుబాటులోకి రానుంది.

ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయిన ఆడియన్స్ ఓటీటీలో చూసి ఎంజాయ్ చేస్తారని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.

Exit mobile version