ఉదయ్ కిరణ్ సంచలన విజయం మళ్ళీ థియేటర్స్ లోకి.. ఎప్పుడంటే!

manasantha-nuvve

టాలీవుడ్ నుంచి వచ్చినటువంటి కొన్ని కల్ట్ లవ్ స్టోరీ చిత్రాల్లో ఒకప్పుడు లవర్ బాయ్ హీరో ఉదయ్ కిరణ్ ఖాతాలోనే చాలా సినిమాలు కనిపిస్తాయి. అలా తన యంగ్ ఏజ్ లోనే భారీ హిట్స్ ని లవ్ స్టోరీస్ తాను అందుకున్నాడు. మరి ఆ చిత్రాల్లో ఒకటే “మనసంతా నువ్వే”. ఆ సినిమా పాటలు కానీ సినిమాలో లవ్ డ్రామా ఆడియెన్స్ లో ఇప్పటికీ ఒక సెపరేట్ స్థానాన్ని సంపాదించుకున్నాయి.

ఎప్పుడో 2001లో వచ్చిన ఈ చిత్రాన్ని దర్శకుడు వి ఎన్ ఆదిత్య తెరకెక్కించగా ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఇక ఈ సినిమా మళ్ళీ ఆడియెన్స్ ని పలకరించడానికి రాబోతుంది. ఈ చిత్రాన్ని రీమాస్టర్ చేసి 4కె ఇంకా డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ లలోకి మార్చి వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న థియేటర్స్ లోకి రాబోతున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. మరి ఈ సినిమా మరోసారి థియేటర్స్ ని షేక్ చేస్తుందా లేదా అనేది వేచి చూడక తప్పదు. ఇక ఈ సినిమాకి ఆర్పీ పట్నాయక్ చార్ట్ బస్టర్ ఆల్బమ్ ని అందించగా రీమా సేన్ హీరోయిన్ గా నటించింది.

Exit mobile version