గత సంవత్సరం ఆంధ్రపదేశ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ బ్లాక్ బస్టర్ హిట్. అలాగే ఆ సినిమాలో పవన్ పోషించిన పాత్ర కూడా బాగా పాపులర్ అయ్యింది. అలాగే ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. ‘గబ్బర్ సింగ్ 2’ చిత్రానికి సంపత్ నంది డైరెక్టర్.
ఈ సినిమా గురించి సంపత్ నందిని అడిగితే గబ్బర్ సింగ్ పాత్రలో ఉండే పొటెన్షియల్ ఒక బ్రాండ్ అని అంటున్నారు. ‘ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ అనే పాత్రని ఒక ఐకాన్ గా నిలిచిపోయే పాత్రని ఇచ్చారు. ఆ పాత్ర, అతని బిహేవియర్, స్టైల్ అన్నీ చూస్తె ఒక బ్రాండ్ లాగా ఉంటాయి. ‘గబ్బర్ సింగ్ 2’ లో ఆ క్వాలిటీస్ అన్నిటినీ ఆ పాత్రలో బాగా ఉపయోగించుకున్నాం. అలాగే కొత్త స్టొరీ లైన్ ని డీల్ చేస్తున్నాం. ఈ సినిమా ‘దబాంగ్ 2′ కి రీమేక్ కాదు, ఇది పూర్తిగా కొత్త కథతో ఉంటుందని’ సంపత్ నంది అన్నాడు.
గబ్బర్ సింగ్ బ్రాండ్ అనేది వినడానికి చాలా ఆసక్తిగా ఉంది. ‘ ఈ సంవత్సరం చివర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఈ రోజు సంపత్ నంది బర్త్ డే కావున ఆయనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.