‘రాజా సాబ్’ మాసివ్ బిజినెస్.. తెలుగు స్టేట్స్ లో మరో రికార్డ్

The Raja Saab 3

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ అలాగే హీరోయిన్ రిద్ధి కుమార్ లు హీరోయిన్స్ గా దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న అవైటెడ్ హారర్ ఫాంటసీ ఎంటర్టైనర్ చిత్రమే “ది రాజా సాబ్”. రీసెంట్ గా వచ్చిన మొదటి సాంగ్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా తాలూకా బిజినెస్ పై సాలిడ్ టాక్ వైరల్ అవుతుంది.

దీని ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజా సాబ్ కి మాసివ్ బిజినెస్ జరుగుతున్నట్టు వినిపిస్తుంది. కేవలం రెండు తెలుగు స్టేట్స్ లోనే 130 కోట్లకి పైగా బిజినెస్ చేసినట్టు తెలుస్తుంది. ఇలా కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే 100 కోట్లకి పైగా బిజినెస్ చేసిన సినిమాగా మరో సినిమాగా రాజా సాబ్ నిలిచింది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ జనవరి 9న గ్రాండ్ గా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతుంది.

Exit mobile version