‘అఖండ 2’ ప్రీరిలీజ్ ఈవెంట్ తాండవం.. ఏ డేట్, ఎక్కడో డీటెయిల్స్ ఇవే!

Akhanda2 6

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో చేస్తున్న నాలుగో చిత్రమే “అఖండ 2 తాండవం”. భారీ హైప్ ని సెట్ చేసుకున్న ఈ సినిమా ఇంకొన్ని రోజుల్లో గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి ఇప్పుడు భారీ గ్రాండ్ ఈవెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు బయటకి వచ్చాయి.

మేకర్స్ ఈ ఈవెంట్ ని నవంబర్ 28న గ్రాండ్ గా కూకట్ పల్లి, ఖైతలాపుర్ గ్రౌండ్స్ లో చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఆరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఈవెంట్ ప్రారంభం కానుందట. సో అఖండ తాండవానికి సమయం దగ్గరకి వచ్చింది అని చెప్పాలి. మరి ఈ ఈవెంట్ లో ఇంకెలాంటి విశేషాలు మేకర్స్ పంచుకుంటారో కూడా వేచి చూడాలి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే 14 రీల్స్ ప్లస్ వారు నిర్మాణం వహించిన ఈ సినిమా గ్రాండ్ గా డిసెంబర్ 5న విడుదల కాబోతుంది.

Exit mobile version