హైదరాబాద్లో శేఖర్ కమ్ముల అనామిక చిత్రం షూటింగ్

Sekhar-Kammula---Nayanatara
నయనతార నటిస్తూ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ‘అనామిక’ సినిమా షూటింగ్ జోరుగా సాగుతుంది. ఈ చిత్రం హిందీ సినిమా ‘కహానీ’ కు రీమేక్. ప్రస్తుతం ప్రొడక్షన్ దశలోవున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది. హైదరాబాద్ ప్రమోద్ నగర్ ప్రాంతంలో దర్శకుడు ఒక భారీ సెట్ ను నిర్మించాడు.

అక్కడ విద్యాబాలన్ నటించిన పాత్రలో నయనతార నటిస్తుంది. ఎండేమోల్ ఇండియా బ్యానర్ పై ఈ సినిమా తెలుగు మరియు తమిళ భాషలలో నిర్మాణం జరుగుతుంది.

శేఖర్ మునుపటి సినిమా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా పరాజయం పాలవ్వడంతో ఈ సినిమాను భారీ రీతిలో విజయవంతం చెయ్యాలని శేఖర్ కమ్ముల కోరుకుంటున్నాడు.

Exit mobile version