మన టాలీవుడ్ సినిమా సీనియర్ హీరోస్ నుంచి తమ రేంజ్ అండ్ ఏజ్ కి తగ్గ సినిమాలు కోసం ఇప్పుడు ట్రెండ్ ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఇలా మెగాస్టార్ నుంచి కూడా చాలా మంది ఆ ట్రీట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా చిరంజీవి లైనప్ లో ప్రస్తుతం పలు సాలిడ్ సినిమాలు ఉండగా ఈ లైనప్ లో ఒక్క పేరు చేరిక కోసం అభిమానులు మరింత ఉత్సాహంగా ఉన్నారు.
మరి ఆ దర్శకుడే సందీప్ రెడ్డి వంగ. తాను మెగాస్టార్ కి ఎంత పెద్ద అభిమాని అనేది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ఆడియెన్స్ కి తెలుసు. లేటెస్ట్ స్పిరిట్ లో కూడా ఉన్నారనే రూమర్స్ కూడా వచ్చాయి కానీ సందీప్ వాటిని కొట్టి పడేసాడు. అయితే లేటెస్ట్ గా స్పిరిట్ లాంచ్ కి మాత్రం మెగాస్టార్ హాజరు కావడం అభిమానుల్లో మళ్ళీ కొత్త ఆశలు చిగురించేలా చేసింది.
తమిళ్ లో తమ ఫ్యాన్ బాయ్ దర్శకులు రజినీకాంత్, కమల్ హాసన్ లకి క్రేజీ ప్రాజెక్ట్ లు ఇస్తున్నారు. ఇక్కడ ఫ్యాన్ బాయ్ సందీప్ కూడా తమ హీరోకి ఒక్క సరైన సినిమా ఇస్తే చూడాలని మెగా ఫ్యాన్స్ ఉవ్విళూరుతున్నారు. మరి ఆ బిగ్ డే సాధ్యం అవుతుందో లేదో కాలమే నిర్ణయించాలి.
