వారణాసి : ఎన్ని పాటలు ఉంటాయో రివీల్ చేసిన కీరవాణి

Varanasi

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ చిత్రం ‘వారణాసి’ కేవలం టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోనే ఇండియన్ ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తుండగా ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం జక్కన్న ఎలాంటి ప్రపంచాన్ని సృష్టించబోతున్నాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తుండగా, ఆయన ఈ సినిమాలో ఎన్ని పాటలు ఉండబోతున్నాయో రివీల్ చేశారు. ‘వారణాసి’ చిత్రంలో మొత్తం 6 పాటలు ఉంటాయని కీరవాణి రివీల్ చేశారు. IFFI 2025 ఈవెంట్‌లో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. దీంతో ఈ సినిమా కోసం కీరవాణి ఎలాంటి ట్యూన్స్ కంపోజ్ చేస్తారా అని ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే, ఇప్పటికే ‘రణ కుంభ’ అనే థీమ్ సాంగ్‌ని రిలీజ్ చేయగా దానికి ట్రెమండస్ రెస్పాన్స్ దక్కుతోంది. ఇక ఈ సినిమాలో మహేష్ రుద్ర అనే పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని 2027 సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version