యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తాజా సినిమా ‘రామయ్యా వస్తావయ్యా..’ చిత్రీకరణ పొల్లాచిలో జరగవలసివుంది. దర్శకుడు హరీష్ శంకర్ అక్కడ వాతావరణం అద్భుతమని తెలిపాడు. కాకపోతే అక్కడ వాతావరణం షూటింగ్ కు అనుకూలించకపోవడంతో ప్రస్తుత షూటింగ్ రద్దు చేసారు
ఈ షెడ్యూల్ రద్దయిన కారణంగా యూనిట్ మొత్తం హైదరాబాద్ తిరిగివచ్చేసారు. తాజా షెడ్యూల్ మరికొన్ని రోజులలో హైదరాబాద్లో మొదలుకానుంది.
ఈ సినిమాలో ఎన్.టీ.ఆర్ సరసన సమంత మరియు శృతి హాసన్ నటిస్తున్నారు. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాత
‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా సెప్టెంబర్లో మన ముందుకు రానుంది. ఎన్.టీ.ఆర్ ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ కాలేజ్ స్టూడెంట్ గా కనిపించనున్నాడు