‘కాంతార చాప్టర్ 1’ మరో ఫీట్..!

కన్నడలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రం ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా వచ్చిన ‘కాంతార చాప్టర్ 1’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. డైరెక్టర్ కమ్ హీరో రిషబ్ శెట్టి ఈ చిత్రాన్ని మలిచిన తీరుకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టి తన సత్తా చాటింది.

అయితే, ఈ సినిమా తాజాగా మరో రేర్ ఫీట్ సాధించింది. థియేట్రికల్ రన్‌లో ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తమ చిత్రాన్ని ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు కాంతార చాప్టర్ 1 టీమ్ కృతజ్ఞతలు తెలిపింది.

ఇక ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించగా అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.

Exit mobile version