‘ఆంధ్ర కింగ్ తాలూకా’లో ఇదే పెద్ద ట్విస్ట్!

Andhra King Taluka

టాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు పి మహేష్ బాబు తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ తెలుగు, కన్నడ రాష్ట్రాల్లో ప్రమోషన్స్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో రామ్ ఇంకా కన్నడ స్టార్ ఉపేంద్ర ఇద్దరూ ఉన్న సంగతి తెలిసిందే.

కానీ ఉపేంద్ర లేటెస్ట్ స్టేట్మెంట్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ సినిమాలో రామ్ కాదు తాను కానీ ఆంధ్రా కింగ్ ఇంకొకరు ఉన్నారు అంటూ చేసిన స్టేట్మెంట్ మంచి వైరల్ గా మారింది. దీంతో ఆ స్టార్ ఎవరు? అంత పెద్ద ట్విస్ట్ ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి వివేక్ మెర్విన్ లు సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ నవంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకొస్తారు.

Exit mobile version