మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఐకానిక్ హిట్ చిత్రాల్లో దర్శకుడు కే మురళీ మోహన్ రావు తెరకెక్కించిన కౌ బాయ్ చిత్రం “కొదమసింహం” కూడా ఒకటి. 1990లో రిలీజ్ అయ్యిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయ్యింది. అంతే కాకుండా టెక్నికల్ గా కూడా మంచి ఛాలెంజింగ్ గా నిలిచిన ఈ సినిమా మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత రీ రిలీజ్ కి వస్తుంది. మేకర్స్ చాలా భద్రంగా దాచుకున్న మరో ప్రింట్ కి రీ మాస్టర్ చేసి ఇప్పుడు విడుదలకి తీసుకొస్తున్నారు.
మరి దీనికి గాను మెగాస్టార్ తన స్పెషల్ వీడియో కూడా విడుదల చేయడం అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఆ సినిమాలో ఒక ఐకానిక్ స్టిల్ ఫోటో ఫ్రేమ్ ఇప్పటికీ చిరంజీవి తన ఇంట్లో పెట్టుకున్నాను అని చూపించారు. మరి అదే స్టిల్ ని మళ్ళీ రీక్రియేట్ చేయడం ఇప్పుడు జరిగింది. జస్ట్ ఆ కౌ బాయ్ టోపీ లేదు కానీ మిగతా అంతా సేమ్ టు సేమ్ ఉంది. దీనితో ఈ క్లిక్ సోషల్ మీడియాలో అలాగే అభిమానుల్లో వైరల్ గా మారింది.
???????????????? ???????????????????? ????????????????????????, ???????????? ???????????? ???????????? “????????????????????????????????“. ???????? ???????? ????????????????????????????????????#KodamaSimham #Chiranjeevi pic.twitter.com/oPO9100mrh
— Team Megastar (@MegaStaroffl) November 20, 2025
