పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం అభిమానులు ఏ రేంజ్లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పవన్ మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాతో ఆయన బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే, ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ తాజాగా ఓ సాలిడ్ విషయాన్ని వెల్లడించారు. ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ తమ లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ప్రమోషన్స్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ గురించిన అప్డేట్ను అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 2026లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో సమ్మర్ ట్రీట్ అందించేందుకు రెడీ అవుతున్నామని చిత్ర నిర్మాతలు ప్రకటించారు.
దీంతో పవన్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం మరింత ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
