తమిళ టాలెంటెడ్ హీరోస్ లో ఒకరైన కార్తీ హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో వా వాథియర్ అలాగే సర్దార్ 2 కూడా ఒకటి. దర్శకుడు నలన్ కుమారస్వామి తెరకెక్కిస్తున్న పోలీస్ యాక్షన్ డ్రామానే వా వాథియర్. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఇన్ని రోజులు కేవలం తమిళ్ లో మాత్రమే అప్డేట్స్ తో వచ్చింది.
దీనితో కార్తీ సినిమా తెలుగులో రిలీజ్ లేదు అనుకునే ఫ్యాన్స్ కి ఫైనల్ గా ఓ క్లారిటీ బయటకి వచ్చేసింది. లేటెస్ట్ గా మేకర్స్ ఈ సినిమాని తెలుగులో “అన్నగారు వస్తారు” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో రివీల్ చేయడం జరిగింది. సో తెలుగు ఆడియెన్స్ ఇప్పుడు ఈ సినిమా పట్ల ఆసక్తి చూపించడం మొదలు పెట్టారు. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా స్టూడియో గ్రీన్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ డిసెంబర్ లో సినిమాని మేకర్స్ సిద్ధం చేస్తున్నారు.
