‘ది రాజా సాబ్’లో ఈ సాంగ్ అదుర్స్.. కానీ

the raja saab

ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇపుడు చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు మారుతీతో చేస్తున్న అవైటెడ్ చిత్రం “ది రాజా సాబ్” కూడా ఒకటి. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ అలాగే రిద్ధి కుమార్ లు హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి ఆడియో ఆల్బమ్ పరంగా ఓ క్రేజీ టాక్ ఇపుడు వినిపిస్తుంది.

సంగీత దర్శకుడు థమన్ ఈ సినిమాకి మొత్తం 5 పాటలు అందించినట్టు తెలుస్తుంది. ఇక ఈ అన్నిటిలో జాతర సాంగ్ ఒకటి మంచి హైలైట్ గా నిలుస్తుంది అని సినీ వర్గాల్లో గట్టి టాక్ వినిపిస్తుంది. మరి ఇదంతా బాగానే ఉంది కానీ అసలు సినిమా పాటలు ఎప్పుడు విడుదల చేస్తారు అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫస్ట్ సింగిల్ ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తుండగా మేకర్స్ నుంచి ఇంకా దీనిపై ఎలాంటి అప్డేట్ లేదు. సో అదెప్పుడు వస్తుందో చూడాలి.

Exit mobile version