టాలెంటెడ్ హీరో ప్రియదర్శి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ప్రేమంటే’ త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ఆనంది హీరోయిన్గా నటిస్తుండగా ప్యూర్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయింది.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌ను మేకర్స్ వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్టులుగా యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల రానున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
దీంతో ఈ సినిమాపై చిత్ర యూనిట్ పూర్తి కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇక ఈ సినిమాను నవనీత్ శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండగా పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నారంగ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను నవంబర్ 21న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.
