టాక్.. ప్రభాస్ ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ మారిందా?

Fauzi

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇమాన్వి హీరోయిన్ గా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే ‘ఫౌజీ’. రీసెంట్ గా వచ్చిన పోస్టర్స్ తో మంచి హైప్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా రిలీజ్ ని మేకర్స్ ఆల్రెడీ ఆగష్టు కి లాక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక షూటింగ్ కూడా ఆల్రెడీ శరవేగంగా కంప్లీట్ అవుతుండగా ఈ సినిమా రిలీజ్ డేట్ కి సంబంధించి లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది.

దీనితో సినిమా ఆగష్టు నుంచి వాయిదా పడినట్టు తెలుస్తుంది. అయితే మరీ ఎక్కువ కాదు కానీ ఆ ఆగష్టు, సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ మొదటి వారానికి షిఫ్ట్ అయ్యిందట. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా బయటకి రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version