“సంతాన ప్రాప్తిరస్తు” ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్

యువ హీరో హీరోయిన్స్ విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా “సంతాన ప్రాప్తిరస్తు”. ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. డైరెక్టర్స్ బాబీ, సందీప్ రాజ్, శైలేష్ కొలను, బీవీఎస్ రవి, ప్రొడ్యూసర్ లగడపాటి శ్రీధర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా

మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ మాట్లాడుతూ.. “ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. ప్రెజెంట్ సొసైటీలో ఉన్న ఒక ఇష్యూను ఈ మూవీలో ఎంటర్ టైనింగ్ గా చూపించారు. ఈ కథను ఎక్కడా అసభ్యత లేకుండా సకుటుంబంగా ప్రేక్షకులంతా చూసేలా రూపొందించారు మా డైరెక్టర్ సంజీవ్. ఈ సినిమాకు తెలుసా నీ కోసమే అనే సాంగ్ కూడా కంపోజ్ చేశాను. ఈ పాట బ్యూటిఫుల్ గా వచ్చింది. మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది”. అన్నారు.

అలాగే నిర్మాత శింగనమల కల్యాణ్ మాట్లాడుతూ..”మధుర శ్రీధర్ తో నాకు 20 ఏళ్ల ఫ్రెండ్షిప్ ఉంది. సినిమా మీద ప్యాషన్ తో శ్రీధర్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఆయన ప్రతి ప్రాజెక్ట్ కు నా వంతు సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నా. అన్నారు.

ఇక రైటర్, డైరెక్టర్ బీవీఎస్ రవి మాట్లాడుతూ.. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమాను చూసి చాలా ఎంజాయ్ చేశాను. ఒక సున్నితమైన అంశంతో దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని ఎంటర్ టైనింగ్ గా చెప్పారు. పెళ్లయ్యాక పిల్లల కోసం కపుల్స్ పై ఫ్యామిలీ, సొసైటీ నుంచి ఒత్తిడి ఉంటుంది. ఆ స్ట్రెస్ ఎలా ఉంటుందో ఫన్నీగా తెరకెక్కించారు. చాందినీ చౌదరి చాలా మంచి మూవీస్ చేస్తోంది. తెలుగు హీరోయిన్స్ కు ఇన్సిపిరేషన్ గా నిలుస్తోంది. విక్రాంత్ బాగా నటించాడు. మురళీధర్ గౌడ్, వెన్నెల కిషోర్ క్యారెక్టర్స్ ఆకట్టుకుంటాయి. వెన్నెల కిషోర్ క్యారెక్టర్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది. సాంగ్స్ బాగున్నాయి. అజయ్ అరసాడ కంపోజ్ చేసిన తెలుసా నీ కోసమే పాట అందరికీ ఫేవరేట్ సాంగ్ అయ్యింది. ఈ సినిమా మంచి విజయం అందుకుంటుందని ఆశిస్తున్నా. అన్నారు.

దర్శకుడు సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ.. “సంతాన ప్రాప్తిరస్తు” టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు ఫ్యామిలీ ఆడియెన్స్ కు ఇలాంటి టైటిల్ ఇబ్బంది అవుతుందేమో అని కొందరు అన్నారు. కానీ మా ప్రొడ్యూసర్స్ ఈ టైటిల్ కథకు యాప్ట్ అని నమ్మి అదే టైటిల్ కొనసాగించారు. మన సొసైటీలో ఇప్పుడు సంతాన లేమి అనే సమస్య ఎక్కువగా ఉంది. మనం దారిలో వెళ్తుంటే చాలా ఫెర్టిలిటీ సెంటర్స్ కనిపిస్తాయి. అవి ఉండొద్దని కాదు. సంతాన సమస్యలు ఉన్నవారు చికిత్స తీసుకోవచ్చు. కానీ అన్నీ బాగుండి లైఫ్ స్టైల్ వల్ల సంతాన లేమితో బాధపడేవారిని ఈ మూవీలో అడ్రస్ చేశాం. మీరు ట్రైలర్ చూస్తే మంచి లవ్ స్టోరీ ఉంది, ఎంటర్ టైన్ మెంట్, ఎమోషన్ ఉన్నాయి, వాటితో పాటు చిన్న మెసేజ్ కూడా ఉంది. ఇదే మా సినిమా. ఫెర్టిలిటీ ఇష్యూను అలాగే తెరకెక్కిస్తే భయపడతారు అందుకే ఆ కథ చుట్టూ ఎంటర్ టైన్ మెంట్ యాడ్ చేసి రూపొందించాం. ఈ సినిమాలో ఇండస్ట్రీలో ఉన్న పేరున్న నటీనటులంతా ఉన్నారు. మంచి బడ్జెట్ ఇచ్చి ఈ సినిమాను చేసే అవకాశం కల్పించారు మా ప్రొడ్యూర్స్. కథ నచ్చి మ్యారీడ్ వుమెన్ గా నటించేందుకు చాందినీ ముందుకొచ్చింది. విక్రాంత్ ఈ పాత్ర కోసం పూర్తిగా సన్నద్ధమై నటించాడు. వీళ్ల జంట మీ అందరినీ థియేటర్స్ లో ఆకట్టుకుంటుంది. ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేసి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిన మా టీమ్ అందరికీ థ్యాంక్స్. అన్నారు.

నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. “ఈ చిత్రంతో ఒక మంచి ప్రయత్నం చేశాం. ఎంటర్ టైన్ మెంట్ ఉన్న ఒక క్లీన్ ఫ్యామిలీ మూవీ నిర్మించాం. ఈ నెల 14న సినిమా రిలీజ్ అవుతుంది. కంటెంట్ ఉన్న మంచి చిత్రాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. అలాగే మా సినిమాను కూడా సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా. చిన్న చిత్రానికి రిలీజ్ ముందు చెప్పేందుకు ఏమీ ఉండదు. రిలీజ్ అయ్యాక అది సాధించే విజయాలకు అడ్డు ఉండదు. ఆరేళ్లుగా మేము లవ్ చేస్తున్న స్క్రిప్ట్ ఇది. కొందరు హీరోలకు చెబితే చేయలేదు. కానీ విక్రాంత్ ముందుకొచ్చాడు. అతనికి థ్యాంక్స్ చెబుతున్నా. వికీ డోనర్ అనే సినిమా ఎన్నో ప్రొడక్షన్ ఆఫీస్ లకు వెళ్లి రిజెక్ట్ అయ్యాక గానీ మూవీగా రాలేదు. బాలీవుడ్ లో ఆయుశ్మాన్ ఖురానాలా మన తెలుగులో విక్రాంత్ పేరు తెచ్చుకుంటాడు. మా హీరోయిన్ చాందినీ ఆకట్టుకునేలా నటించింది. డైరెక్టర్ సంజీవ్ తో పాటు మా టీమ్ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.

నిర్మాత నిర్వి హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. “మీ అందరి దగ్గర నుంచి మా సినిమాకు రిలీజ్ ముందే మంచి అప్లాజ్ వస్తోంది. సినిమా హిట్ అనే పాజిటివ్ నెస్ కనిపిస్తోంది. “సంతాన ప్రాప్తిరస్తు” కథ విన్నాక ఈ సినిమా తప్పకుండా నిర్మించాలని అనుకున్నాం. మంచి బడ్జెట్ లో పర్పస్ ఫుల్ మూవీ నిర్మించాం. ఈ సినిమాకు తెలుగు హీరోయిన్ ను తీసుకోవాలి, తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేయాలని చాందినీని ఎంచుకున్నాం. ఆమె కల్యాణి పాత్రలో ఆకట్టుకునేలా నటించింది. విక్రాంత్ ఈ చిత్రంలో చైతన్య క్యారెక్టర్ కు యాప్ట్ గా అనిపించాడు. కొన్నిసార్లు ఆయనను చైతన్య అని పిలిచేవాళ్లం. శ్రీధర్, విక్రాంత్, నేనూ ఐటీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చాం. ఈ సినిమాకు మేము చేసిన ప్రయత్నం సక్సెస్ అవుతుందనే ఆశిస్తున్నాం. అన్నారు.

హీరోయిన్ చాందినీ చౌదరి మాట్లాడుతూ.. ఈ స్క్రిప్ట్ వినగానే ఇప్పుడున్న సమాజంలో చెప్పాల్సిన కథ ఇది అనిపించింది. మనకు ఫెర్టిలిటీ సెంటర్స్ చాలా పెరిగాయి. ఇన్ ఫెర్టిలిటీ ఇష్యూ అంటే అమ్మాయిలనే అనేవారు. అమ్మాయిలోనే లోపం ఉంది, పిల్లలు పుట్టడం లేదంటే మరో పెళ్లి చేద్దామనే అభిప్రాయానికి వచ్చేవారు. కానీ ఫస్ట్ టైమ్ మేల్ ఫెర్టిలిటీ ఇష్యూను ఈ సినిమాలో చూపించడం కొత్తగా అనిపించింది. ఈ సమస్య గురించి మాట్లాడేందుకు అందరూ ఇబ్బంది పడతారు. మిగతా వాళ్లు చులకనగా చూస్తారా, నవ్వుతారా అని సందేహిస్తారు. అలాంటి సీరియస్ పాయింట్ చుట్టూ ఫన్, ఎంటర్ టైన్ మెంట్ చేర్చి ఈ చిత్రాన్ని రూపొందించడం ద్వారా అందరూ మాట్లాడుకునేలా ఒక ప్రయత్నం చేశాం. సినిమా రిలీజ్ అయ్యాక ఈ సమస్య మీద అవగాహన కలుగుతుందని ఆశిస్తున్నాం. ఈ చిత్రంలో కల్యాణి పాత్రలో నేను నటించగలను అని నమ్మి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ సంజీవ్ రెడ్డి గారికి థ్యాంక్స్. అలాగే ఈ ప్రాజెక్ట్ ను ఎక్కడా తగ్గకుండా నిర్మించి రిలీజ్ కు తీసుకొస్తున్నారు మా ప్రొడ్యూసర్స్ శ్రీధర్ గారు, హరి ప్రసాద్ గారు. మా హీరో విక్రాంత్ డెడికేటెడ్ యాక్టర్. ఈ సినిమాతో ఆయనకు మంచి పేరు రావాలి. మా కో స్టార్స్ అందరూ ఆకట్టుకుంటారు. మా మూవీ ట్రైలర్ ఇష్టపడిన వారు సినిమాను కూడా ఎంజాయ్ చేస్తారు”. అని తెలిపింది.

అలాగే హీరో విక్రాంత్ మాట్లాడుతూ.. “కెరీర్ పరంగా సాఫ్ట్ వేర్ లో ఉన్నా, నాకు మూవీస్ అంటే ప్యాషన్ ఉండేది. గతంలో ఒక సినిమా చేశా అది అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత చిన్న గ్యాప్ తీసుకుని థియేటర్ ద్వారా నటనను మెరుగుపర్చుకున్నా. ఒకరోజు శ్రీధర్ గారిని కలిసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఆయన ఈ స్క్రిప్ట్ పంపించారు. నేను రెగ్యులర్ ఫార్మేట్ మూవీస్ చేస్తే ఎవరికీ నచ్చదు. డిఫరెంట్ మూవీస్ చేయాలి, అందరికీ రిలేట్ అయ్యేలా ఉండాలి అనుకున్నా. “సంతాన ప్రాప్తిరస్తు” కథ చదివాక నాకు అదే ఫీల్ కలిగింది. ఒక సెన్సిటివ్ ఇష్యూను తీసుకుని దానికి ఎంటర్ టైన్ మెంట్ యాడ్ చేసిన చిత్రమిది. మూవీ చివరలో మంచి ఎమోషన్ తో, మెసేజ్ తో ఆడియన్స్ థియేటర్స్ నుంచి బయటకు వెళ్తారు. ఈ మూవీలో చైతన్య అనే సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ రోల్ చేశాను. ప్రతి సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ ఈ క్యారెక్టర్ తో రిలేట్ అవుతారు. ఇప్పుడున్న కపుల్స్ లో సంతాన సమస్య ఎక్కువగా ఉంది. వారందరూ ఈ సినిమాతో రిలేట్ అవుతారు. మంచి మూవీస్ చేసి పేరు తెచ్చుకున్న చాందినీ మా చిత్రానికి ఆకర్షణగా నిలుస్తుంది. వెన్నెల కిషోర్, అభినవ్, తరుణ్ భాస్కర్..ఇలా కామెడీ బాగా పండించగల వారితో నేను స్క్రీన్ షేర్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. నేను ఈ మూవీ చేసే అవకాశం కల్పించిన శ్రీధర్ గారికి, హరిప్రసాద్ గారికి, సంజీవ్ రెడ్డి గారికి థ్యాంక్స్. మా టీమ్ లోని ప్రతి ఒక్కరూ మూవీ బెటర్ గా వచ్చేందుకు ఎఫర్ట్స్ పెట్టారు. మనం బలంగా నమ్మితే లైఫ్ లో ఏదైనా సాధించగలం. సినిమా పట్ల నా ప్యాషన్ కూడా సక్సెస్ అవుతుంది అని
నమ్ముతున్నా. అన్నారు.

డైరెక్టర్ సందీప్ రాజ్ మాట్లాడుతూ .. “సంతాన ప్రాప్తిరస్తు” ట్రైలర్ చూశాను చాలా బాగుంది. ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూతో ఎంటర్ టైనింగ్ గా మూవీ చేయడం సాధారణ విషయం కాదు కత్తిమీద సాము లాంటిది. ఇలాంటి సబ్జెక్ట్స్ కరెక్ట్ గా చెబితే మంచి విజయాన్ని అందుకుంటాయి. ట్రైలర్ చూస్తే సంజీవ్ రెడ్డి గారు ఆ విషయంలో సక్సెస్ అయ్యారని అనిపిస్తోంది. హీరో విక్రాంత్ కు ఆల్ ది బెస్ట్. నా ఫస్ట్ మూవీ హీరోయిన్ చాందినీ. ఆమె ఒక సినిమా చేస్తుందంటే అందులో కంటెంట్ ఉంటుంది అనేంత పేరు తెచ్చుకుంది. తనకు ఈ మూవీ పెద్ద హిట్ కావాలి. ఈ మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.

యువ డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ.. ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే స్ట్రాంగ్ కంటెంట్ తో సినిమా చేశారనే నమ్మకం కలిగింది. విజువల్స్ చూస్తే మేకింగ్ చాలా క్వాలిటీగా ఉంది. ప్రతి సాంగ్ వినాలని అనిపించేలా ఉంది. ఒక సెన్సిటివ్ ఇష్యూతో ఎంటర్ టైన్ మెంట్ కలిపి చేసిన చిత్రమిది. ఇలాంటి సినిమాలు మంచి సక్సెస్ అవుతాయని గతంలో ప్రూవ్ అయ్యింది. పెళ్లికాగానే ఆ జంట మీద పిల్లల కోసం ప్రెషర్ ఉంటుంది. ఫ్యామిలీ, సొసైటీ నుంచి ఈ ప్రెషర్ వస్తుంది. నేనూ ఆ ప్రెషర్ చూశాను. కొత్త జంటలు పరస్పరం అర్థం చేసుకున్నాకే పిల్లలు గురించి ప్లాన్ చేసుకోండని సలహా ఇస్తున్నా. విక్రాంత్ హానెస్ట్ గా కనిపిస్తున్నాడు. అతనికి సక్సెస్ రావాలని కోరుకుంటున్నా. చాందినీ మంచి మూవీస్ చేస్తోంది. అవార్డ్స్ కూడా అందుకుంటోంది. ఈ సినిమా ఆమెకు మరో మంచి మూవీ కావాలి. ఈ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ.. “సంతాన ప్రాప్తిరస్తు” ట్రైలర్ చాలా బాగుంది. ఇలాంటి సెన్సిటివ్ సబ్జెక్ట్ అందరికీ నచ్చేలా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ కథను స్క్రీన్ మీదకు తీసుకొచ్చేందుకు ఆరేళ్లు వెయిట్ చేశారు డైరెక్టర్ సంజీవ్ గారు. ఓపిక అనేది చాలా గొప్ప విషయం. మీకు తప్పకుండా సక్సెస్ దక్కుతుంది. అలాగే ఇలాంటి మంచి మూవీ చేసిన ప్రొడ్యూసర్స్ శ్రీధర్ గారికి, హరిప్రసాద్ గారికి విజయం దక్కాలి. హీరో విక్రాంత్ ఇందాక బాగా మాట్లాడాడు. మనం కష్టపడి ప్రయత్నిస్తే తలెత్తుకునే రోజు వస్తుందని అన్నాడు. విక్రాంత్ కు కూడా “సంతాన ప్రాప్తిరస్తు” గుర్తింపు తీసుకురావాలని కోరుకుంటున్నా. చాందినీ డెడికేషన్ ఉన్న హీరోయిన్. గాయంతో కాలు నొప్పి ఉన్నా, మా డాకూ మహారాజ్ మూవీలో పరుగెత్తే సీన్స్ చేసింది. తను కొత్తదనం ఉన్న మూవీస్ చేస్తూ వస్తోంది. ఈ సినిమా కూడా ఆమెకు మరో హిట్ మూవీ కావాలని కోరుకుంటున్నా. అని తెలిపారు.

Exit mobile version