మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమా రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ ఈ సినిమాపై అంచనాలను భారీగా క్రియేట్ చేశాయి.
ఇక ఈ చిత్ర షూటింగ్ దగ్గరపడుతుండటంతో ఈ మూవీ ప్రమోషన్స్‌ను ఒక్కొక్కటిగా స్టార్ట్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్ర సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, సింగర్ మోహిత్ చౌహాన్, దర్శకుడు బుచ్చిబాబు కలిసి దిగిన ఫోటోను రామ్ చరణ్ తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేశాడు. ఏం జరుగుతోంది అంటూ ఆయన ప్రశ్నించగా.. ‘చికిరి’ సార్ అంటూ బుచ్చిబాబు సానా రిప్లై ఇచ్చాడు.
దీన్నిబట్టి ఈ సినిమా నుంచి త్వరలోనే ఫస్ట్ సింగిల్ సాంగ్‌గా ‘చికిరి’ ఉండబోతుందని అభిమానులు ఫిక్స్ అయ్యారు. ఇక ఈ సినిమాలో అందాల భామ జాన్వీ కపూర్ అచ్చియమ్మ అనే పాత్రలో నటిస్తోండగా శివ రాజ్‌కుమార్, జగపతి బాబు తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. 2026 మార్చి 27న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.
“Chikiri” Sir???? https://t.co/UPxl0IVceB
— BuchiBabuSana (@BuchiBabuSana) November 3, 2025
