కోలీవుడ్ సినిమా నుంచి వచ్చిన పలు ఐకానిక్ హిట్ చిత్రాల్లో దర్శకుడు సెల్వ రాఘవన్ తెరకెక్కించిన సినిమా యుగానికి ఒక్కడు కూడా ఒకటి. తమిళ్ లో అనుకోని రెస్పాన్స్ అందుకోని ఈ సినిమా తెలుగులో హిట్ అయ్యింది.ఇలా కొన్నాళ్ల కితం పార్ట్ 2 ని కూడా అనౌన్స్ చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇదే దర్శకుడు సెల్వ రాఘవన్ కి ఇబ్బందికరంగా మారిందట.
ఈ సినిమా వల్ల తను బయట ఏ సినిమాకి కూడా వెళ్లలేకపోతున్నాను అని వెళ్తే ఆ సినిమా ఎంజాయ్ చేయలేకపోతున్నాను అని అంటున్నారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్లినా కూడా అంతా యుగానికి ఒక్కడు 2 అప్డేట్ కోసం అడుగుతున్నారట. దీనితో బాగా విసుగెత్తిపోయానని తమిళ్ సినీ వర్గాలు నుంచి టాక్. మరి ధనుష్ తో ఈ అవైటెడ్ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.
