అఫీషియల్: సూర్య తెలుగు సినిమాలో కేజీయఫ్ నటి

కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య హీరోగా దర్శకుడు వెంకీ అట్లూరి కలయికలో తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా మేకర్స్ సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక ఈ సినిమాపై లేటెస్ట్ గా ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టాండన్ పై బ్యూటిఫుల్ లుక్ పోస్టర్ విడుదల చేసారు.

నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ అప్డేట్ ను మేకర్స్ షేర్ చేసారు. అలాగే ఆమె ఈ సినిమాలో భాగం కావడం తమకి ఎంతో ఆనందంగా ఉందని చెబుతున్నారు. ఇక ఈ అప్డేట్ తోనే చాలా మందికి ఈమె కూడా ఉంది అని ఇవాళ్టితో అధికారికంగా తెలిసింది. సో ఈ సినిమా కాస్టింగ్ పరంగా మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో మమితా బైజు తదితరులు నటిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ ఇంకా ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version