పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో చేస్తున్న భారీ చిత్రం స్పిరిట్ కోసం అందరికీ తెలిసిందే. ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా అనౌన్స్ చేసే మూడేళ్లు దాటింది. అయినప్పటికీ హైప్ అలానే ఉంది. అయితే ఫైనల్ గా ఈ సినిమా షూట్ పై సాలిడ్ న్యూస్ వినిపిస్తోంది.
దీని ప్రకారం స్పిరిట్ ఈ నవంబర్ మొదటి వారం లోనే పట్టాలెక్కే విధంగా సిద్ధం అయ్యినట్టు తెలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాలు వరకు ఈ మొదటి షెడ్యూల్ లో మేకర్స్ తెరకెక్కించేస్తారని ఇప్పుడు తెలుస్తోంది. సో మొత్తానికి మాత్రం స్పిరిట్ ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్. ఇక ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు అలాగే భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
