వెంకీ మామకు వెల్కమ్ చెప్పిన ‘శంకర వరప్రసాద్ గారు’

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్, ఫస్ట్ సింగిల్ సాంగ్ కూడా ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాయి.

అయితే, ఈ సినిమాలో మరో స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఓ కీలక పాత్రలో నటిస్తాడని చిత్ర యూనిట్ గతంలో తెలిపింది. తాజాగా వెంకటేష్ ఈ చిత్ర షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. దీంతో వెంకటేష్‌కు మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. దీనికి సంబంధించి ఓ ప్రోమోను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ వీడియోలో వెంకటేష్ షూటింగ్ సెట్స్‌కు రాగా ‘వెల్కమ్ వెంకీ.. మై బ్రదర్’ అని చిరంజీవి అనగా.. ‘చిరు సార్.. మై బాస్’ అని వెంకటేష్ ఒకరినొకరు హత్తుకున్నారు.

ఇక ఈ సినిమాలో వెంకటేష్ పాత్ర ప్రేక్షకులను మెప్పించడంతో పాటు సినిమాకు కీలకంగా ఉండబోతుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాలో స్టార్ బ్యూటీ నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ప్రొడ్యూస్ చేస్తున్నారు. 2026 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Exit mobile version