మిస్టరీ థ్రిల్లర్ ‘కర్మణ్యే వాధికారస్తే’ అక్టోబర్ 31న విడుదల

Karma-ye-Vadikarasthe

ఉషస్విని ఫిలిమ్స్ బ్యానర్‌పై రూపొందించిన ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ ‘కర్మణ్యే వాధికారస్తే’ విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ నటులు బ్రహ్మాజీ, శత్రు, మరియు ‘మాస్టర్’ మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వం వహించగా, డి ఎస్ ఎస్ దుర్గా ప్రసాద్ నిర్మించారు.

బెనర్జీ, పృథ్వీ, శివాజీ రాజా, అజయ్ రత్నం మరియు శ్రీ సుధా వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. మధుర ఆడియో ద్వారా విడుదలైన చిత్ర ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచి, అంచనాలను పెంచింది.

చిత్ర బృందం మాట్లాడుతూ, “భగవద్గీతలోని ఈ సూక్తి ‘పని చేసే హక్కు నీకుంది, ఫలితాల మీద కాదు’ అని చెబుతుంది. మా టైటిల్‌కు అనుగుణంగా కథనం చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది. బ్రహ్మాజీ, శత్రు, మాస్టర్ మహేంద్రన్ వారి నటనతో కథకు మరింత బలాన్నిచ్చారు. విద్యార్థుల హత్యలు, మిస్సింగ్ కేసులు, కిడ్నాప్‌లు వంటి సమాజంలో జరిగే వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ను రూపొందించాం” అని తెలిపారు.

సెన్సార్ సభ్యుల ప్రశంసలు అందుకుని, యు/ఏ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

Exit mobile version