యుద్ధానికి సిద్ధం.. అతడే ఒక బెటాలియన్..!

Prabhas Hanu Raghavapudi

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో దర్శకుడు హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్న పీరియాడిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కూడా ఒకటి. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాలో ప్రభాస్ వైవిధ్యమైన లుక్‌తో కనిపిస్తాడని చిత్ర యూనిట్ చెబుతూ వస్తోంది. ఇక దీపావళి పండుగ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి ఓ అదిరిపోయే బ్లాస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

ఈ సినిమాకు సంబంధించిన నేపథ్యాన్ని రివీల్ చేశారు. ‘యుద్ధంలో అతడే ఒక బెటాలియన్’ అనే స్టేట్మెంట్‌తో ఓ ప్రీ-లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. తుపాకుల మోతతో యుద్ధానికి ఈ ఒక్కడే చాలు అనే రీతిలో ఈ ప్రీ-లుక్ పోస్టర్‌ను డిజైన్ చేశారు. ఇక ‘ఆపరేషన్ Z’లో ఈ యోధుడు ఎలాంటి యుద్ధాన్ని చేయబోతున్నాడనేది మనకు ఈ సినిమా ద్వారా చూపెట్టబోతున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలను అక్టోబర్ 22 నుండి రివీల్ చేయబోతున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ దీపావళి ట్రీట్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. అంతేగాక, అక్టోబర్ 22 కోసం వారు అప్పుడే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ జోడీ ఎలాంటి ప్రేమకథతో రాబోతున్నారా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఈ సినిమాకు విశాల్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version