ఓటిటి సమీక్ష: ‘రైడర్’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : అక్టోబర్ 19, 2025
స్ట్రీమింగ్‌ వేదిక : ఈటీవీ విన్

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : రావణ్ రెడ్డి నిట్టూరే, మేఘన, గడ్డం శ్రీనివాస్ తదితరులు
దర్శకుడు : కిషోర్ గుణాన
నిర్మాత : సురేష్ కొత్తపల్లి
సంగీత దర్శకుడు : శశాంక్ తిరుపతి
సినిమాటోగ్రాఫర్ : అక్షయ్ వసూరి

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

ప్రతీ వారం లానే ఈ వారం కూడా మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ కథా సుధ నుంచి కొత్త లఘు చిత్రం “రైడర్” వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

యువ జంట భైరవ్ (రావణ్ రెడ్డి నిట్టూరే) అలాగే మేఘన (మేఘన) గాఢంగా ప్రేమించుకుంటారు. తన నాన్న కోరిక మేరకు భైరవ్ ఒక రైడర్ గా బైక్ స్టంట్ మాన్ గా లైఫ్ ని రిస్క్ తో గడుపుతూ ఉంటాడు. కానీ మేఘన తండ్రి (గడ్డం శ్రీనివాస్) వేరే సంబంధాలు ఆమెకి చూస్తారు. వీరు ప్రేమించుకుంటున్నారని తెలిసినప్పటికీ ఆమెని ఓ బలమైన కారణం చెప్పి ఒప్పిస్తారు. ఇలా వేరైన ఇద్దరూ మళ్ళీ కలిసారా లేదా? ఆ పెళ్లి తర్వాత వారి లైఫ్ లో జరిగిన మార్పులు ఏంటి? వారి ప్రేమ మళ్ళీ వాళ్ళని కలిపిందా లేదా అనేది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్:

ఒక సింపుల్ లవ్ స్టోరీస్ లాంటి వాటిని ఇష్టపడే వారు బాగా ప్రేమ కథలు ఇష్టపడేవారికి ఈ లఘు చిత్రం కొంతమేర ఓకే అనిపించవచ్చు. మెయిన్ లీడ్ మధ్య కొన్ని లవ్ సీన్స్ అలాగే వారి కెమిస్ట్రీలు ఇందులో ఆకట్టుకునేలా ఉంటాయి.

అలాగే నటుడు రావణ్ రెడ్డి తన రోల్ లో సూటయ్యాడు. రెండు షేడ్స్ తాలూకా లుక్స్ ఇంకా అందులో మూడ్ ని క్యారీ చేసాడు. అలాగే ఫీమేల్ లీడ్ నటి మేఘన కూడా తన రోల్ లో బాగుంది. వీరి నడుమ కొంచెం సింపుల్ మూమెంట్స్ బాగున్నాయి. అలాగే హీరోయిన్ కి తన తండ్రి ట్రాక్ లో ఓ ప్రశ్న ఆలోచించేలా చేస్తుంది.

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రంలో లైన్ చాలా పలుచనిదే ఇది వరకే ఎన్నో ప్రేమకథలుగా చూసేసిందే కావడం పైగా కథనం కూడా ఏమంత ఎగ్జైటింగ్ గా ఉండకపోవడం వంటివి నిరాశ కలిగిస్తాయి. దీనితో పాటుగా నెమ్మదిగా సాగే కథనం ఈ లఘు చిత్రాన్ని మరింత బోరింగ్ గా మార్చేసింది.

కేవలం అరగంటే అయినప్పటికీ ఇందులో ఏమంత ఆకట్టుకునే సన్నివేశాలు పెద్దగా ఉండవు పైగా ఈ బోరింగ్ కథనం పాటలు అనవసరంగా పెద్దగా ఫీల్ లేకుండా సాగుతాయి. దీనితో ఇంత సాగదీత అవసరమా అన్నట్టు ఉంటుంది. ఇద్దరి ప్రేమికుల మధ్య మంచి డ్రామా లాంటిది ఎమోషనల్ గా పెట్టి ఉంటే ఇంపాక్ట్ కలిగించి ఉండేది. కానీ అవేమి ఇందులో లేవు. దీనితో ఈ సినిమా మాత్రం బోర్ గానే అనిపిస్తుంది.

సాంకేతిక వర్గం:

ఈ లఘు చిత్రంలో టెక్నీకల్ టీం వర్క్ అండ్ నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయని చెప్పవచ్చు. ప్లాన్ చేసుకున్న సెటప్, కెమెరా వర్క్ లో కొన్ని షాట్స్ ఇంప్రెస్ చేసాయి. సంగీతం, పాటలు కూడా బానే ఉన్నాయి కానీ ఫ్లోలో వర్కౌట్ కాలేదు. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ప్లాన్ చేయాల్సింది. రెండో సాంగ్ తీసేసి కథనం కొంచెం ఫాస్ట్ పేస్ లో నడిపిస్తే బాగుణ్ణు.

ఇక దర్శకుడు కిషోర్ గుణాన విషయానికి వస్తే.. తన వర్క్ అంత ఇంప్రెసివ్ గా లేదనే చెప్పక తప్పదు. చాలా సింపుల్ లైన్ ని అంతకంటే సింపుల్ గా బోరింగ్ గా తాను నడిపించారు. చిన్న చిన్న సీన్స్ లో ఎమోషన్స్ తప్ప దాదాపు మిగతా కథనం అంతా రొటీన్ అండ్ రెగ్యులర్ గానే సాగించారు.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ లఘు చిత్రం ‘రైడర్’ తో లవ్ రైడ్ అంత ఎంగేజింగ్ గా ఉండదని చెప్పాలి. ఎంత లవ్ స్టోరీస్ లాంటివి ఇష్టపడేవారికి అయినా ఈ చిత్రం చాలా స్లోగా సాగుతున్న కథగా అనిపిస్తుంది. కేవలం ఒక్క పాయింట్ మాత్రం బాగుంది తప్ప మిగతా కథనం అంతా చప్పగానే ఉంది.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

Exit mobile version