మంచి అవకాశాలు వదులుకుంటున్న నితిన్? ఎందుకు?

Nithiin

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి టాలెంటెడ్ హీరోస్ లో యూత్ స్టార్ నితిన్ కూడా ఒకరు. మరి నితిన్ కొంచెం టైం తీసుకుంటున్నప్పటికీ తనకి సరైన విజయం వరించడం లేదు. అయితే నితిన్ కి అపజయాలు నుంచి కోలుకోవడం కొత్తేమి కాదు. హిట్ కొడితే మంచి లాభాలు అందించగలిగే నితిన్ లైనప్ ఇపుడు ఆసక్తిగా మారుతుంది.

గతంలో వినిపించిన ఎల్లమ్మ కోసం అయినా కానీ ఇటీవల తన హిట్ దర్శకుడు విక్రమ్ కే కుమార్ తో సినిమా వదులుకోవడం లాంటివి ఒకింత ఆశ్చర్యం కలిగించే అంశాలు అని చెప్పాలి. వేణు, విక్రమ్ ఇద్దరూ మంచి పొటెన్షియల్ ఉన్న దర్శకులే అయినప్పటికీ వారి సినిమాలు నితిన్ వదులుకున్నాడు అనే టాక్ సర్ప్రైజింగ్ అనే అనుకోవాలి.

మరి తనని మెప్పించే రేంజ్ సినిమాలు కావాలంటే ఇంకెలాంటి స్క్రిప్ట్ ఉండాలో కానీ తన ఫ్యాన్స్ మాత్రం ఈ టాక్ పరంగా కొంచెం డిజప్పాయింటెడ్ గానే ఉన్నారని చెప్పక తప్పదు. మరి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుందో చూడాలి.

Exit mobile version