‘అఖండ 2’లో దిమ్మతిరిగే సర్ప్రైజ్?

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తన బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే అఖండ 2 తాండవం. భారీ హైప్ ఉన్న ఈ సినిమాని బోయపాటి శ్రీను ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కిస్తున్నట్టు ఆల్రెడీ టాక్ ఉంది. అంతే కాకుండా చాలా రోజులు నుంచి టాలీవుడ్ లో నెలకొన్న సెకండాఫ్ కర్స్ కి అఖండ 2 సమాధానం చెప్తుంది అనే టాక్ కూడా వచ్చింది.

అయితే ఇప్పుడు మరో క్రేజీ న్యూస్ ఈ సినిమాపై వినిపిస్తుంది. ఈ సినిమాలో అఖండ రోల్ పై ఆడియెన్స్ కి థియేటర్స్ లో దిమ్మతిరిగే బ్లాస్టింగ్ సర్ప్రైజ్ ని బోయపాటి ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ‘తాండవం’ అనే పదం ఎందుకు పెట్టారో దానితో బాలయ్య తాండవం ఆడితే ఎలా ఉంటుందో చూపించేదే ఆ సర్ప్రైజ్ అని తెలుస్తుంది.

మరీ ఎక్కువ డీటెయిల్ వదిలితే ఎగ్జైట్మెంట్ పోతుంది కానీ బాలయ్య, పరమశివుని తాండవం మాత్రం ఆడియెన్స్ ని ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోవడం మాత్రం గ్యారెంటీ అట. మరి ఇదే కానీ జరిగితే పాన్ ఇండియా లెవెల్లో సినిమా దుమ్ము లేపడం గ్యారెంటీ అని చెప్పవచ్చు.

Exit mobile version