రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘కాంతార చాప్టర్ 1’ అద్భుత విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌పై ప్రశంసలు కురిపిస్తూ ప్రముఖులు కూడా పోస్ట్‌లు పెట్టిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా క్లైమాక్స్ షూట్ సమయంలో తాను ఎంత కష్టపడ్డాడో తెలుపుతూ రిషబ్ కొన్ని పిక్స్ తో పాటు ఓ మెసేజ్ ను కూడా పోస్ట్ చేశారు. రిషబ్ తన మెసేజ్ లో ఏం పోస్ట్ చేశాడంటే.. ‘ఇవి క్లైమాక్స్ సమయంలో తీసినవి. సినిమా విడుదలయ్యాక క్లైమాక్స్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. దానివెనక ఎంతో శ్రమ ఉంది. వాచిపోయిన కాళ్లు, అలసిపోయిన శరీరం.. మీరంతా ప్రశంసిస్తోన్న సన్నివేశాల వెనక ఇవి ఉన్నాయి’ అని తన మెసేజ్ లో పోస్ట్ చేశాడు.
రిషబ్ ఈ సినిమా క్లైమాక్స్ గురించి ఇంకా మాట్లాడుతూ.. ‘ఇంత కష్టపడ్డాం కాబట్టే ఆ సన్నివేశాలను మీరు ఆరాధించే స్థాయిలో షూట్ చేయగలిగాం. ఇది మేం నమ్మిన దైవిక శక్తి ఆశీర్వాదం వల్ల మాత్రమే సాధ్యమైంది. మాపై ఆదరణ చూపిస్తూ మద్దతు ఇస్తోన్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు’’ అంటూ రిషబ్ తన పోస్ట్ చెప్పుకొచ్చాడు. దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకువచ్చిన కాంతార మంచి స్పందనను సొంతం చేసుకుంది.