రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కించనున్న సినిమా ‘రౌడీ జనార్దన’. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే పూజాకార్యక్రమాలతో మొదలైంది. ఐతే, ఇప్పుడు ఈ సినిమా పై ఓ రూమర్ వినిపిస్తోంది. సినిమాలో విజయ్ దేవరకొండ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయని.. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో విజయ్ పాత్రకు సంబంధించి వచ్చే ఫ్లాష్ బ్యాక్ లోని ఎమోషనల్ సీన్స్ అద్భుతంగా ఉంటాయట.
ఈ సీన్స్ లో ఫాదర్ సెంట్ మెంట్ కూడా చాలా ఎమోషనల్ గా ఉంటాయని తెలుస్తోంది. మరి ఈ వార్త నిజమైతే, విజయ్ దేవరకొండ అభిమానులకు ఈ సినిమా ఎప్పటికీ స్పెషల్ గా నిలిచిపోతుంది. అన్నట్టు ఈ సినిమా కథ గ్రామీణ నేపథ్యంలో సాగనుంది. ఇక ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా కీర్తి సురేశ్ నటించనుంది. కాగా ఇప్పుడు విజయ్ చేతిలో రెండు సినిమాలున్నాయి. వాటిలో రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఒకటి. ఈ సినిమాతో పాటు రౌడీ జనార్దన సినిమాను కూడా విజయ్ చేస్తున్నాడు.