తన మూడో సినిమానే మొదటి సినిమా అంటున్న విక్రమ్ కొడుకు!

vikram

కోలీవుడ్ నుంచి నటన పరంగా ప్రాణం పెట్టే హీరోస్ లో స్టార్ నటుడు విక్రమ్ కూడా ఒకరు. మరి విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ ఆల్రెడీ ఒక సాలిడ్ డెబ్యూని ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. వాటిలో అర్జున్ రెడ్డి రీమేక్ గా చేసిన ఆదిత్య వర్మ అలానే తన తండ్రితో చేసిన మహాన్ లు ఉన్నాయి.

ఇలా ఆల్రెడీ రెండు సినిమాలు నిజానికి మూడు దర్శకుడు బాలతో కూడా ఓ సినిమా ఉంది. కానీ దీని ప్లేస్ లోనే ఆదిత్య వర్మ గా మళ్ళీ చేశారు. ఇలా ఆ రెండు సినిమాల తర్వాత తన నుంచి వస్తున్న మూడో సినిమానే “బైసన్”. అయితే ఈ సినిమానే తాను తన డెబ్యూ సినిమాని యంగ్ హీరో చెప్తున్నాడు.

ఎందుకంటే ఆదిత్య వర్మ ఒక రీమేక్ అలాగే మహాన్ సినిమా తన నాన్నది కానీ బైసన్ మాత్రమే తన నుంచి సోలో అండ్ స్ట్రైట్ సినిమా కావడంతో తాను ఈ సినిమానే డెబ్యూ సినిమాగా భావిస్తున్నట్టు తెలిపాడు. అయితే విక్రమ్ కొడుకుగా వచ్చినప్పటికీ రెండు సినిమాలతోనే ధృవ్ మంచి ముద్ర వేసుకున్నాడు. ఇక ఈ సినిమాతో ఎలా అలరిస్తాడో చూడాలి.

Exit mobile version