అక్కినేని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ చైతన్య అక్కినేని హీరోగా తండేల్ తో సూపర్ సక్సెస్ కొట్టిన తర్వాత తన నెక్స్ట్ సినిమాలతో తాను బిజీగా ఉన్నాడు. అంతే కాకుండా రీసెంట్ గానే నటి శోభిత ధూళిపాళని పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి అసలు తమ లవ్ స్టోరీ ఎలా మొదలైంది అనేది రివీల్ చేసాడు. నటుడు జగపతిబాబు టాక్ షో జయమ్ము నిశ్చయమ్మురా లో తాను మాట్లాడుతూ ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ నుంచి తమ పరిచయం మొదలైనట్టుగా తెలిపాడు.
తాను ఓ పోస్ట్ చేస్తే దానికి శోభిత రిప్లై ఇచ్చింది అని అక్కడ నుంచి ఇద్దరి నడుమ మెసేజ్ లు మొదలై తమ లవ్ స్టోరీ పుట్టినట్టుగా అసలు విషయం అందులో రివీల్ చేసాడు. దీనితో ఈ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం నాగ చైతన్య విరూపాక్ష దర్శకుడు కార్తీక్ వర్మ దండుతో సాలిడ్ థ్రిల్లర్ చేస్తున్న సంగతి తెలిసిందే.