‘బాహుబలి’ అంటే ప్రభాస్ మాత్రమే.. ఆ హీరోని మొదటిగా అనే మాటే లేదు

ఇండియన్ సినిమా దగ్గర ఆడియెన్స్ లో ఎంతో ప్రభావం చూపించి ముద్ర వేసుకున్న పలు ఐకానిక్ పాత్రల్లో సూపర్ హీరో లంతో పాత్ర బాహుబలి కూడా ఒకటి. మరి ఇలాంటి బాహుబలి రోల్ లో ప్రభాస్ తప్పితే మరో ఏ హీరో సెట్ కాడు అనే రీతిలో డార్లింగ్ ఇమిడిపోయి తానే బాహుబలి అనిపించుకున్నాడు.

అయితే ఎప్పుడు నుంచో ప్రభాస్ అసలు బాహుబలి రోల్ కి మొదటి ఛాయిస్ కాదు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ని ముందు రాజమౌళి అనుకున్నారు అంటూ పలు రూమర్స్ ఇప్పటికీ ఉన్నాయి. అయితే వీటిపై నిర్మాత లేటెస్ట్ గా అసలు క్లారిటీ ఇవ్వడం జరిగింది. తమకి బాహుబలి అంటే ప్రభాస్ మాత్రమే అని తాము హృతిక్ నే కాదు మరే ఇతర హీరోలని సంప్రదించింది లేదు అని తేల్చేసారు. సో బాహుబలి అంటే వన్ అండ్ ఓన్లీ హీరో ప్రభాస్ మాత్రమే అని చెప్పాలి.

Exit mobile version