దీపావళికి తనతో తానే పోటీ నుంచి తప్పుకున్న ప్రదీప్ రంగనాథన్

lik

ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (LIK)’ మరియు ‘డ్యూడ్’ సినిమాలు ఒకేసారి రిలీజ్ డేట్‌ను ఈ దీపావళికి ప్రకటించాయి. అయితే, క్లాష్‌ తమ హీరో నటించిన రెండు సినిమాలు క్లాష్ కావడం ఇష్టం లేక LIK టీమ్ వెనక్కి తగ్గింది.

తాజాగా ఈ చిత్ర మేకర్స్ LIK రిలీజ్ డేట్‌ను డిసెంబర్ 18, 2025 గా ప్రకటించారు. తమ హీరో నటించిన డ్యూడ్ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించాలని LIK మేకర్స్ ఆకాంక్షించారు.

విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్న LIK సినిమా సై ఫై రొమాంటిక్ కామెడీగా రూపొందుతోంది. కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, ఎస్‌.జె. సూర్య, యోగిబాబు, గౌరీ జీ కిషన్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version