‘ఓజీ సీక్వెల్’లో అకీరా.. గెస్ట్ రోల్ లో పవన్ ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన “ఓజీ” చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది. పైగా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను సాధించింది. ఈ నేపథ్యంలో ఓజీ సీక్వెల్‌పై వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. దీనికితోడు, దర్శకుడు సుజిత్ కూడా సీక్వెల్ లేదని చెప్పడం లేదు. పైగా పవన్ కళ్యాణ్ కూడా తనకు సుజిత్ పాయింట్‌ చెప్పారని, ఇప్పటికే తన స్పీచ్ లో ప్రస్తావించారు. కాబట్టి, ఓజీ సీక్వెల్ ఉందని బలంగా వినిపిస్తోంది.

కానీ, ఓజీ సీక్వెల్‌ లో పవన్ కళ్యాణ్ నటిస్తాడా ?, తనకు సుజిత్ పాయింట్‌ చెప్పారని పవన్ చెప్పాడు, కాబట్టి పవన్ హీరో అయినా అయ్యి ఉండాలి, లేదా పవన్ వారసుడు అకీరా అయినా హీరో అయ్యి ఉండాలి. ఇప్పుడు సుజిత్‌ నాని హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయ్యాక, ఓజీ సీక్వెల్‌ ను అకీరాతో చేసే అవకాశం కనిపిస్తోంది. అకీరా తొలి ప్రాజెక్టుగా ఓజీ సీక్వెల్ వచ్చి, సినిమాలో పవన్ కూడా గెస్ట్ రోల్ లో కనిపిస్తే.. ఫ్యాన్స్ కి ఆ కిక్కు వేరుగా వుంటుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Exit mobile version