శంకర వరప్రసాద్ కోసం ఆ నటుడు ఎలాంటి విలనిజం చూపిస్తాడో..?

Mana-Shankara-Vara-Prasad-G (1)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ సాంగ్ ప్రోమో ప్రేక్షకులను మెప్పించాయి.

అయితే, ఈ సినిమాలో మలయాళ నటుడు షైన్ టామ్ చోకో కూడా నటిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. దీంతో ఆయన ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, అనిల్ రావిపూడి చిత్రాల్లో విలన్‌లతో కూడా కామెడీ చేయించారు. మరి ఇప్పుడు మెగాస్టార్ కోసం ఈ యాక్టర్ ఎలాంటి విలనిజం చూపిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.

ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version